
మనను సాలూరు ఏప్రిల్23:- పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో పెద్దగడ్డ జలాశయం, గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారులు పరిశీలనకు వచ్చిన ఎస్టీ కమిషన్ చైర్మన్ డి వి జి శంకర్రావు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు జన్నీ రామయ్య కుడుమూరు భూ పోరాట కమిటీ నాయకులు సూకురు అప్పలస్వామి, నిర్వాసిత మత్స్యకారుల సంఘం నాయకులు మోసూరు చిన్నారావ్ సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, ఎస్టి కమిషన్ సభ్యులు డాక్టర్ డివిజి శంకర్రావు ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.గిరిజన మత్స్యకారులకు అదునాతనమైనటువంటి రక్షణకు సంబంధించి లైఫ్ జాకెట్లు వలలు బోట్లు పంపిణీ చేయాలని, పెద్దగడ్డ జలాశయం పర్యాటక కేంద్రంగా మార్చి అభివృద్ధి పరచాలని ప్రమాదంలో మత్స్యకారులు మరణిస్తే 20 లక్షలు ఎక్సరేసి చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా రక్షణ సంబంధించినటువంటి మెటీరియల్స్ రైన్ కోట్లు బూట్లు పంపిణీ చేయాలని. అలాగే, గిరిజనులకు మరియు గిరిజన మత్స్యకారులకు సొసైటీల ద్వారా రుణాలు మంజూరు చేయాలని అన్నారు. అలాగే, కుడుమూరు 48 సర్వేనెంబర్ 782 ఎకరాలు సాగులో ఉన్నటువంటి 11 గ్రామాల గిరిజనులకు నేటికీ పట్టాలు ఇవ్వకపోవడం, ఆ భూములు, అన్యాక్రాంతమైపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వ భూమిని మోకాస పేరుతో యాళ్ల తరబడి డబ్బులు వసూలు చేసినటువంటి వారిని పట్టించుకోకుండా నేటికీ పట్టా లేవకుండా తాత్సారం చేయడం సరైన కాదని గత ప్రభుత్వ హయాంలో సర్వే చేసిన వివరాలను కూడా నేటి వరకు బహిర్గతం చేయలేదని ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఆ భూములకు హక్కులు కల్పించి గిరిజనులను ఆదుకోవాలని ఎస్టీ కమిషన్ చైర్మన్ ని కోరడం జరిగినది అలాగే గిరిజిల్లపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.అన్యాక్రాంతం చేసేందుకు ప్రయత్నం చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రీన్ ఫీల్డ్ రహదారి వలన గిరిజనులు భూములు కోల్పోయిన వారికి పాచిపెంట మండలం మోదుగ పంచాయతీ లోని మూడు గ్రామాలు అనగా బంగారు గుడ్డి,కాట్రగుడ్డి,బుచ్చింపాడు, ఈ గ్రామాల్లో గిరిజనులు భూములు తోపాటు అటవీ ఉత్పత్తుల సంబంధించిన కుంకుడుకాయలు, సీతాఫలాలు సంబంధించిన చెట్లు, చింత చెట్లు గ్రీన్ ఫీల్డ్ రహదారి వలన కోల్పోయారు. ఈ భూములన్నీ విశాఖ జిల్లా అనంతగిరి రెవిన్యూ లో ఉండడం వలన నేటికీ పట్టాలు ఇవ్వకపోవడం వలన వారికి హక్కులు లేకుండా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే వలన భూములు కోల్పోవడంతో పాటు గిరిజన్లో అటవీ పోడు భూములకు వెళ్లడానికి తోవల్లేకుండా సైడ్ వాల్ నిర్మాణం చేపట్టి వ్యవసాయం చేయడానికి అవకాశం లేని విధంగా గ్రీన్ ఫీల్డ్ హైవే అధికారులు సైడ్ వాల్ నిర్మించారని, దీని వలన వ్యవసాయ పంటలను ఇంటికి తెచ్చుకోలేక పంటలను మార్కెట్ కి తీసుకు వెళ్లలేక నరకయాతన పడుతున్నటువంటి పేదలు గిరిజనులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని వివరించడం జరిగింది. అందుకే ప్రభుత్వం 200 మీటర్లకు ఒక గ్రౌండ్ రోడ్డు వేస్తున్నారు అంటే గ్రీన్ ఫీల్డ్ హైవే కింద నుంచి అక్కడి నుంచి సర్వీస్ రోడ్డు వేయాలని సర్వీస్ రోడ్డు వేస్తే పంట పొలాలకు వెళ్లేందుకు ట్రాక్టర్లు పెట్టి దున్నించుకునేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, దీన్ని పరిగణలోకి తీసుకోవాలని తెలియజేయడం జరిగింది, అలాగే గిరిజన చట్టాలు సక్రమంగా అమలు చేయాలని జీవో నెంబర్ త్రీ ని కొనసాగించి గిరిజనులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన అనంతరం స్పందించిన కమిషన్ ఛైర్మన్ డాక్టర్ డివిజి శంకర్రావు మాట్లాడుతూ ఈ సమస్యలన్నింటిని పై అధికారులకు రాష్ట్రస్థాయిలో జాతీయస్థాయిలో తీసుకువెళ్లి పరిష్కారం కోసం కృషి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమానికి గిరిజనులు రైతులు పాల్గొన్నారు.