Mana News :- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నది అగ్రహారం సమీపంలో శ్రీ అహోబిల మఠం 27వ పీఠాధిపతుల బృందావనం దేవాలయం ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి భూమి పూజ చేసి పనులను ప్రారంభించడం జరిగినది. అనంతర దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులను పొందడం జరిగింది. వేద బ్రాహ్మణులు ఎమ్మెల్యే శాలువా కప్పి పూలమాలవేసి అక్షింతలు వేసి ఆశీర్వదించడం జరిగింది దేవాలయ అభివృద్ధికి నా వంతు సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి, మాజీ సర్పంచ్ రఘువర్ధన్ రెడ్డి, నాయకులు ఆంజనేయులు, సవారన్న బాలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.