
కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ ఆవాజ్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ కమిటీ కడప జిల్లా అధ్యక్షులు పి , చాంద్ భాష ,బద్వేల్ ఆవాజ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ ,అబ్దుల్ సత్తార్ ,ఎస్ ,అన్వర్ భాష లు ,మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లోని పహెల్ గావ్ లో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పుల జరిపి 27 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నారు. ఈ సంఘటనను పిరికిపందుల చర్యగా అభివర్ణిస్తు తీవ్రంగా ఖండించారు, ఉగ్రవాదుల కాల్పులలో అసువులుబాసిన, నేలకొరిగిన భారత ముద్దుబిడ్డలకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నా శ్రద్ధాంజలి గటిస్తు ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నా. క్షతగాత్రులు, స్వల్పంగా గాయపడ్డవారు, తీవ్రంగా గాయపడ్డా వారు త్వరగా కోలుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. అక్కడ తిరిగి మామూలు పరిస్థితులు ఏర్పడాలని అందుకు అందరూ సహకరించాలని సంయమనంతో సామరస్యపూర్వకంగా సోదరభావంతో మెలగాలని అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు భారత ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 5 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. ముష్కరులను పట్టుకొని కులము, మతము , భేదం లేకుండా ఉరిశిక్ష వేయాలన్నారు,భారత ప్రభుత్వం ఉగ్రవాదులను ఏరివేతలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా మరియు అశ్రద్ధగా నడుచుకోకుండా ఉక్కుపాదం మోపాలని, భారతదేశంలో ఇలాంటి సంఘటనలు పునరావృతంకాకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది, ఇలాంటి సంఘటనలు భారతదేశ ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు, ఉగ్రవాదులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బకు దెబ్బ గుణపాఠం నేర్పాలని ఈ సమావేశంలో ఆవాజ్ నాయకులు ఎస్ రహీం , కేబి రసూల్ , పి అల్లా బాకాష్ , ఎస్,అబ్దుల్లా ,ఎస్ ఫారుక్ పాల్గొన్నారు.