మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మొహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పార్టీ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, మాజీ జడ్పీ ఛైర్మన్ రాజు కు పూలమాల శాలువాతో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సాదుల సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ లు కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం లేదన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ గంగారెడ్డి,మాజీ సర్పంచులు లక్ష్మీనారాయణ,నారాయణ,నాయకులు రాంచందర్, శ్రీనివాస్,