మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో కరెంటు వైర్లు తగిలి టిప్పర్ లారీ పూర్తిగా దగ్ధమైంది. తూర్పులక్ష్మీపురం గ్రామంలోని రామాలయం ఎదురుగా గ్రావెల్ రోడ్డు పనులు నిమిత్తము మట్టి వేయడం కోసం టిప్పర్ లారీ వెళ్లడంతో కిందకి ఉన్న మెయిన్ లైన్ కరెంటు వైర్లు తగిలి లారీ దగ్ధమైంది.మంటలను గమనించి డ్రైవర్,క్లీనర్ లారీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు