మన న్యూస్,నెల్లూరు రూరల్, ఏప్రిల్ 22:- నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో బారాషహీద్ దర్గాలో 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బారాషహీద్ దర్గా ముఖద్వారాలను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.ముస్లిం పెద్దల సలహాలు, సూచనలతోనే బారాషహీద్ దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.బారాషహీద్ దర్గా అభివృద్ధి కోసం గత 11 సంవత్సరాలుగా నా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాను అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. 85 లక్షల రూపాయల వ్యయంతో బారాషహీద్ దర్గా ముఖద్వారాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి జలై నెలలో రొట్టెల పండుగ నాటికి ఒక ముఖ ద్వారం ప్రారంభించే విధంగా పనిచేస్తున్నాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి బారాషహీద్ దర్గా పై ప్రత్యేకమైన గౌరవం ఉంది. మంత్రి నారాయణ మరియు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో బారాషహీద్ దర్గా అభివృద్ధికి కృషి చేస్తా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పై కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు మరియు ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.