
మన న్యూస్ (విజయనగరం) ; విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కొట్టాం గ్రామం ఉమా చోడేశ్వర స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజలు, హోమాలు, సోమవారం విగ్రహాలు ఊరేగింపు నిర్వహించినట్లు పూజారి స్వరూప్ తెలియజేశారు. నిర్వాహకులు కొట్టాం,తాండ్రంగి ఇరు గ్రామాల పెద్దలు మాట్లాడుతూ... బుధవారం నాడు నవగ్రహ ప్రతిష్ట, భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.