కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 23: బద్వేల్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తొట్టిగారిపల్లి పరిధిలోని తిరువెంగలాపురం సచివాలయం నందు రాష్ట్రీయ బాలుర ఆరోగ్య పథకము మరియు సికి్సెల్ అనిమయి, ఎన్ సి డి సి డి సర్వే భాగంగా డాక్టర్ జె. వినయ్ కుమార్ మరియు హెల్త్ ఎడ్యుక్టర్ బి.వెంగయ్య పర్యవేక్షించడమైనది, ఈ కార్యక్రమంలో డాక్టర్ జె.వినయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రీయ బాలుర ఆరోగ్య కార్యక్రమంలో ప్రతి విద్యార్థినీ విద్యార్థులు స్క్రీనింగ్ చేసి దీర్ఘకాలిక వ్యాధులు కనుగొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పేర్కొన్నది అదేవిధంగా వేసవికాలంలో ఎండలు తీవ్రంగా ఉండటం వలన ఉదయాన్నే పనులు ముగించుకొని ఇంటికి చేరవలెను అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థులు ఎక్కువగా వేసవిలో బయట తిరగకూడదు తిరుగుటం వలన,డయోరియా,అతిసారము వచ్చేదాన్ని అవకాశం ఉన్నందున, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ డయోరియా కేసులను నివారించవలసిన ఉన్నదని పేర్కొనడమైనది. వెల్త్ వెల్నెస్ సెంటర్ నందు జరుగు సర్వీసెస్‌ను మరియు రికార్డ్స్ రిపోర్ట్స్ సక్రముగా ఉంచుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని ఆరోగ్య సిబ్బందికి తెలియజేయడమైనది. బి.వెంగయ్య హెల్త్ ఎడ్యుక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు అయినటువంటి అతిసారము సంక్రమన,ఆ సంక్రమణ వ్యాధులు, దోమల ద్వారా వ్యాధులు మొదలగు ప్రభులే అవకాశం ఉండటం వలన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని వ్యక్తిగత పరిశుభ్రతను పాటించి జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో పైన విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించడమైనది. ఈ కార్యక్రమంలో పిచ్చమ్మ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు హెల్త్ ఎడ్యుక్టర్ పి. నాగమ్మ, మహాలక్ష్మమ్మ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.