కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 22: వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మంగళవారం మధ్యాహ్నం మైదుకూరు రోడ్డు మంచినీటి చలివేంద్రం వద్ద సుమారు 4,00 మందికి పైగా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ కీర్తిశేషులు పెద్దిరెడ్డి మాధవరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పెద్దిరెడ్డి చెన్న కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో బద్వేల్ ఎస్సై సత్యనారాయణ చేతుల మీదుగా మజ్జిగ వితరణ కార్యక్రమానికి ప్రారంభించారు, అనంతరం ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు కూల్ ప్రిజ్ ద్వారా మంచినీరు వితరణ చేయడమే కాకుండా మధ్యాహ్నం సమయంలో మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషకరమన్నారు, మంగళవారం మజ్జిగ వితరణ చేపట్టిన కృష్ణారెడ్డిని వారు అభినందించి శాలుతో సత్కరించారు, ఈ కార్యక్రమంలో అరవ శ్రీనివాసులు రెడ్డి, పెద్దిరెడ్డి చెన్న కృష్ణారెడ్డి, మెట్ట సుబ్బారావు, చాటకుండు కామేశ్వరరావు, రెండ సుబ్బారెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు*