Mana News :- 'దేవర' లాంటి ఒక బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కుతన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'డ్రాగన్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ లేకుండానే ప్రశాంత్ నీల్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు. ఇప్పుడు తదుపరి షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం మంగళూరులో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. సినిమాకు అత్యంత కీలకమైన ఈ షెడ్యూల్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..Also Read : Satya : 'రావు బహదూర్' గా వస్తున్న సత్యదేవ్.. ఈ సినిమాకు ఎన్టీఆర్‌తో పాటు ప్రశాంత్ నీల్ కూడా భారీ ఎత్తున రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారు. హోంబాలే బ్యానర్ నుంచి బయటకు వచ్చి ప్రశాంత్ నీల్ చేస్తున్న మొదటి సినిమా కావడంతో కాస్త గట్టిగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడట. దానికి మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒప్పుకుంది. ఒక పక్క మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుండగా, హీరో తరఫున ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా సహ-నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఒక టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ అయిన టీ-సిరీస్ కూడా ఈ ప్రాజెక్టులో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు, ఈ సినిమాలో టీ-సిరీస్ సంస్థ పెట్టుబడులు పెట్టినందుకు గానూ, నాన్-థియేట్రికల్ రైట్స్ దక్కించుకోబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాజెక్టుల నుంచి మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు టీ-సిరీస్ కలిసి పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.