మనన్యూస్,నెల్లూరు:5 వ డివిజన్ సత్యనారాయణపురంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తల సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశానికి హాజరు అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కార్యకర్తల తో మాట్లాడి సానా సుబ్బారెడ్డి ని 5 వ డివిజన్ వైసిపి ఇన్ చార్జ్ / అధ్యక్షులు గాను,ఇబ్రహీం ను కోఆర్డినేటర్ గానను ప్రకటించారు.ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ.. డివిజన్ లో పార్టీ బలోపేతం దిశగా.. తామంతా కలిసికట్టుగా ఏకతాటిపై పనిచేస్తామని తెలియజేశారు.ఈ సందర్భంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ
మంచి చేసే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఎందుకు వదులుకున్నామని ఈరోజు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని తెలిపారు.ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్న కమిట్మెంట్ కలిగిన లీడర్ జగన్మోహన్ రెడ్డి ని అన్నారు.పార్టీకి కష్ట కాలంలో సేవలందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని తెలిపారు.డివిజన్ ప్రజలతో చర్చించి సుబ్బారెడ్డి ని 5వ డివిజన్ ఇంచార్జిగా.. కోఆర్డినేటర్ గా ఇబ్రహీం ను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.వారికి సహకరిస్తూ డివిజన్ లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి.. మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేయాలన్నారు.