మన న్యూస్, నారాయణ పేట:- రాజయోగిని బ్రహ్మా కుమారి డాక్టర్ దాది రతన్మోహిని (101 సంవత్సరాలు) తాజాగా దేహత్యాగం చేసిన సందర్భంగా ఓం శాంతి సంతోషి ఆధ్వర్యంలో మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సంధర్బంగా సంతోషి మాట్లాడుతూ,1954 లో జపాన్లో జరిగిన విశ్వ ధర్మ సమ్మేళనం లో దాది రతన్ మోహిని భారత దేశం తరపున ప్రాతినిథ్యం వహించారని అన్నారు. దేశ విదేశాలలో రాజయోగ విద్యను ప్రచారం చేశారని, విశ్వ శాంతి కోసం కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయికోడ్ ఆనంద్, శేఖర్ రెడ్డి, వైద్య సిబ్బంది, ఓం శాంతి బృందం తదితరులు పాల్గొన్నారు.