
మన న్యూస్, కావాలి, ఏప్రిల్ 21:- కావలిలో తన మిత్రుడు దామిశెట్టి సుదీర్ నాయుడు తండ్రి అయిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామిశెట్టి శ్రీనివాసులు నాయుడు మరణించడంతో వారి పార్థివ దేహానికి కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాళులర్పించారు. శ్రీనివాసులు నాయుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చంద్రశేఖర్ రెడ్డి భగవంతుని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీనివాసులు నాయుడు అంతిమయాత్రలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తో కలిసి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
