శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ప్రశాంత వాతావరణంలో శంఖవరం ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ముగిసిందని ఏపీ మోడల్ స్కూల్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ వైఎస్వి కిరణ్ సూచించారు. శంఖవరం మండలంలో సోమవారం ఏపీ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడింది. ఈ ప్రవేశ పరీక్షకు సిఎస్ గా వైఎస్వి కిరణ్ మరియు డిఓ జి. శేఖర్(మండపం ప్రధానోపాధ్యాయులు) బాధ్యత వహించారు. ఈ సందర్భంగా ఏపీ మోడల్ స్కూల్ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ వైఎస్వి కిరణ్ మాట్లాడుతూ, మొత్తం 289 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, వీరిలో 240 మంది పరీక్షకు హాజరయ్యారని, వాతావరణం వేడిగా ఉండటంతో, విద్యార్థులకు చల్లటి మంచినీళ్లు ఏర్పాటు చేపట్టినట్లు ఆయన తెలిపారు.ఏపీ మోడల్ స్కూల్ పరీక్ష విజయవంతం చేసిన మోడల్ స్కూల్ సిబ్బంది కి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఎస్వీ రమణ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి సంతృప్తి ని వ్యక్తం చేశారన్నారు. పరీక్ష ఫలితాలను ఈ నెల 27న విడుదల చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.