Mana News :- తెలంగాణ పోలీసులపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిది రోజుల్లో నాలుగోసారి విచారణకు పిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడోసారి విచారణకు వచ్చిన సమయంలో అసలు పోలీస్ స్టేషన్లో అధికారులే లేరని తెలిపారు. కీల విషయాలపై ఫోకస్ చేయాల్సిన రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిపక్ష నేతలను టార్చర్ చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. పోలీసులపై మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన అనంతరం మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు. గ్రూప్ 1 పరీక్షల్లో 900 మార్కులు ఉంటే కొందరు అభ్యర్ధులకు 2 మార్కులే వచ్చాయి. 654 మంది అభ్యర్ధులకు ఒకే రకమైన మార్కులు వచ్చాయి. ఇలాంటి వాటి మీద విచారణలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పని చేస్తూ అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారు. అని మన్నె క్రిశాంక్ ఆరోపించారు.