శంఖవరం మన న్యూస్ (అపురూప్) : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు రాజాల చిట్టిబాబు ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ప్రత్తిపాడు కోర్టు బార్ అసోసియేషన్ కు 2025-2026 సంవత్సరానికి గాను శనివారం జరిగిన ఎన్నికలలో నూతన అధ్యక్షుడిగా రాజాల చిట్టిబాబు ఎన్నికయ్యారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో సీనియర్ న్యాయవాదులు మళ్ళ గంగాధర రావు, పిల్లి బలరాముడు, బాదా జాన్ బాబు, బత్తుల రవి కుమార్, రాయి అచ్యుత రామారావు, ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా కొప్పిశెట్టి శ్రీనివాసరావు, జనరల్ సెక్రెటరీగా సోము గౌరీ శంకర్, కోశాధికారిగా పలివెల నాగేంద్ర రాజు, జాయింట్ సెక్రటరీగా గెడ్డం కామేశ్వరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా మంచి కంటి శ్రీనివాస్ భారతి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా వేగి భద్రం ఎన్నికయ్యారు.గతంలో రాజ్యాల చిట్టిబాబు అన్నవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎనలేని సేవలందించారని కొనియాడుతూ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నూతన బాధ్యతలు స్వీకరించిన రాజ్యాల చిట్టిబాబును ఘనంగా సన్మానించి అభినందనలు తెలుపుతూ స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బద్ది రామారావు, బుర్ర వాసు, బొమ్మిడి సత్యనారాయణ మాజీ ఎంపీటీసీ కంచిబోయిన శ్రీను సాధనాల లక్ష్మణ బాబు, గాబు కృష్ణ, దేశి లింగ వెంకట రమణ, గజ్జి సత్యనారాయణ, కేళంగి జాన, నక్క శ్రీను, గాబు శివ, మచ్చ రాజు, కొయ్య రమణ, దూది సూరిబాబు, ఆలపు సత్యనారాయణ, కంది కోళ్ల హరీష్, పాలెపు దుర్గారావు, మిత్యాల సురేంద్ర తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.