ఉదయగిరి మన న్యూస్:మండేటెండను సైతం లెక్కచేయక 75 అభివృద్ధి పనులను ప్రారంభించి 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..
ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో వాడవాడల నవనిర్మాణ దీక్ష దక్షుడు అమరావతి రూపశిల్పి పట్టిసీమ పోలవరం నిర్మాణ కృషివలుడు నేటి దేశ రాజకీయంలో పరిణితి చెందిన రాజనీతిజ్ఞుడు యువతకు స్ఫూర్తి ప్రదాత ప్రజా శ్రేయస్సు అతని ధ్యేయం కాలంతో పోటీ పడే తెలుగు చంద్రుడు, సవాళ్లను స్వీకరిస్తూ సంక్షోభంలోనూ అద్భుతాలు సృష్టించగల సైనికులు అలుపెరగని పోరాటయోధుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.
75 ఏళ్ల నవ యువ నాయకుడు చంద్రన్న పుట్టినరోజును పురస్కరించుకొని వింజమూరు ప్రధాన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. యువత పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని 8 మండలాలలో మండల నాయకుల ఆధ్వర్యంలో చంద్రన్న పుట్టినరోజు వేడుకలను నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ జలదంకి,కలిగిరి, వింజమూరు ,ఉదయగిరి, మండలాల్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజులు పురస్కరించుకొని నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసుకున్న 75 అభివృద్ధి కార్యక్రమాలను మండుటెండను సైతం లెక్కచేయక ఎంతో ఓర్పు నేర్పుతో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ప్రారంభించారు.
ముఖ్యంగా సిసి రోడ్లు, అంగన్వాడీ భవనాలు, నూతన భవనాలు, గోకులం షెడ్లును ప్రారంభించారు. నాయకులు అభిమానులు చంద్రన్న పై ఆకాశమంత అభిమానాన్ని చాటుతూ పోటీపడి మరి పెద్ద ఎత్తున పుట్టినరోజు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ చేపట్టిన కార్యక్రమాలలో వేలాదిగా టిడిపి నాయకులు కార్యకర్తలు హాజరై పండుగ వాతావరణం లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అపారమైన అనుభవం సమర్థవంతమైన పాలనతో రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అందించే ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జన్మదిన వేడుకల్లో పాల్గొని చంద్రన్నకు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు అందించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారి వెంట మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి మాజీ జడ్పీ చైర్మన్ పొన్నుబోయిన చంచల బాబు యాదవ్ ఎనిమిది మండలాల మండల కన్వీనర్లు మండల నాయకులు కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.