మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు లో నేడు విడుదలైన ఐ. ఐ.టీ- జ జె.ఇ.ఇ (మెయిన్ 2025) ఫలితాల్లో జాతీయస్థాయిలో 274 ర్యాంక్ సాధించిన కృష్ణచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థి నిర్మల్ తేజాను ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.
ఈ సందర్భంగా విద్యార్థి నిర్మల్ తేజాకు మిఠాయిలు తినిపించి.. రాబోయే ఐఐటీ- జెఇఇ అడ్వాన్స్ ఫలితాల్లో కూడా.. సత్తా చాటాలని చంద్రశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిమాట్లాడుతూ…….ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదువుకున్న నిర్మల్ తేజ ఐ ఐ టి -జెఇఇ ఫలితాల్లో జాతీయస్థాయిలో 274 వ ర్యాంక్ సాధించడం అభినందనీయమన్నారు.
ఒక నెల్లూరులోనే విద్యాసంస్థలు నిర్వహిస్తున్న కృష్ణ చైతన్య కళాశాల ఐఐటి- జెఇఇ ఫలితాల్లో జాతీయస్థాయిలో ర్యాంకులు సొంతం చేసుకోవడం అభినందనీయమన్నారు రాబోయే రోజుల్లో కృష్ణ చైతన్య కళాశాల ఐఐటి -జెఇఇ అడ్వాన్స్ ఫలితాల్లో కూడా విజయకేతనం ఎగరవేయాలని ఆకాంక్షించారు.
ఇంతటి అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోవడానికి కృష్ణ చైతన్య కళాశాల నిర్వహిస్తున్న ఎలైట్ ప్రోగ్రామే కారణమని విద్యార్థి నిర్మల్ తేజ తెలిపారు
అద్భుతమైన ఫలితాలకు కారణమైన.. కళాశాల సిబ్బందిని.. విద్యార్థి తల్లిదండ్రులు చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు.
నిర్మల్ తేజ చెల్లించిన .. లక్ష రూపాయల ఫీజు చెక్కును.. కృష్ణ చైతన్య కళాశాల చైర్మన్ కృష్ణ రెడ్డి మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది.