మనన్యూస్,తిరుపతి:భారతదేశ రాజకీయాల్లోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక లెజెండ్ అని ముత్యాల రెడ్డి పల్లి మాజీ సర్పంచ్ బోయనపాటి మమత చౌదరి కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలను మాజీ సర్పంచ్ మమత చౌదరి ఆధ్వర్యంలో ఆదివారం ఎంఆర్ పల్లి సర్కిల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పేరిట భారీ కేకును ఏర్పాటు చేసి ఆయన ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని పార్టీ నేతల మధ్య కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మబ్బు దేవనారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుమార్ వెయ్యి మంది పేదలకు మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిపాలన దక్షత కలిగిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని, ఆయన మరో 20 ఏళ్లు రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించేలా ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. విజనరీ లీడర్ అనే పదానికి చంద్రబాబు నిలువెత్తు నిదర్శనం అన్నారు. 2047 నాటికి దేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుందని, చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడం ఖాయమని ఆమె చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమంలో మన్యం శ్రీనివాసులు, కృష్ణ యాదవ్, ఏపీ నాయుడు, బాల రమేష్, బాబు రాజేంద్రప్రసాద్, ప్రవీణ్, మస్తానీ, తులసిరెడ్డి, నిరంజన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.