మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మారక ద్రవ్యాలు సేవించి జీవితాలు నాశనం చేసుకోవద్దని నార్కోటిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సామ్య నాయక్ అన్నారు. నిజాంసాగర్ మొహమ్మద్ నగర్ మండలాల్లోని వడ్డేపల్లి,కోమలాంఛ, గ్రామాలలో కల్తీకల్లు ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని నివారించేందుకు కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరు దూరంగా ఉండాలన్నారు. ప్రజలు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే సంబంధిత అధికారులకు 1908 టోన్ ఫ్రీ నంబర్ ద్వారా సమాచారం అందించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఎస్ ఐ శివకుమార్,తహసీల్దార్ బిక్షపతి, ఐకెపి ఎపిఎం రాంనారాయణ గౌడ్, ఆరోగ్యశాఖ అధికారిని ఎలిజిబెత్, పంచాయతీ కార్యదర్శి భీమ్రావు,నాయకులు ప్రజా పండరి,తదితరులు ఉన్నారు.