మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్): అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో రాజాల చిట్టిబాబు ప్యానెల్ విజయం సాధించింది. చిట్టి బాబు తమ ప్రత్యర్థి ఆర్ వెంకటరావు పై 17 ఓట్లు మెజార్టీ తో గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా కాపిశెట్టి శ్రీనివాసరావు, కార్యదర్శిగా సోము గౌరీ శంకర్, కోశాధికారిగా పలివెల నాగేంద్ర రాజు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా మాచికంటి శ్రీనివాస భారతి లు విజయం సాధించారు. ఎన్నికల పర్యవేక్షకులుగా న్యాయవాదులు బాధ జాన్ బాబు, మల్ల గంగాధర్, అచ్యుత రామారావు వ్యవహరించారు. విజేతలను సీనియర్ న్యాయవాదులు చెలంకూరి రామకృష్ణ, ఏ కుక్కుటేశ్వరరావు, చిట్టంశెట్టి పుల్లయ్య, బుగతా శివ, చెక్కపల్లి శ్రీనివాస కుమార్ తదితర న్యాయవాదులు అభినందించారు.