మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్,గంజాయి,కల్తీ కల్లు తీసుకోవడం ద్వారా ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని వీటిని నిర్మూలించి సమాజాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నార్కోటిక్స్ విభాగం డిఎస్పి బిక్షపతి అన్నారు. బిచ్కుంద మండలంలోని మత్తు పదార్థాలు,మాదక ద్రవ్యాల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఎవరైనా గంజాయి కల్తీ కల్లు విక్రయించిన రవాణా చేసినట్లు తెలిసిన వెంటనే సమాచారం అందించాలన్నారు.డయల్ 1908 కాల్ చేసి చెప్పాలన్నారు. ఈ టోన్ ఫ్రీ నంబర్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద సీఐ నరేష్,ఎస్ ఐ మోహన్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులున్నారు.