మన న్యూస్ ఏప్రిల్19:=పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలోఎలక్ట్రానిక్ వ్యర్ధాలు ఈ వ్యర్ధాలు వలన వాతావరణంతో పాటు తాగే నీరు కలుషితం అవుతుందని వీటి వ్యర్ధాలను జాగ్రత్తగా రీసైకిల్ చేసుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని పాంచాలి గ్రామ సర్పంచ్ గూడెపు యుగంధర్ అన్నారు పాంచాలి రైతు సేవ కేంద్రం పరిధిలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మాట్లాడుతూ పాడైన బల్బులు బ్యాటరీలు ఎలక్ట్రానిక్ వైర్లు పాడిన స్విచ్ బోర్డులు వంటి వాటిని జాగ్రత్తగా సేకరించాలని వాటిని కాలవలలో వీధులలో పారవేయకూడదని దీనివలన పర్యావరణం కలుషితం అవుతుందని తెలిపారు గ్రామంలో చెత్త సేకరణకు చెత్తకుండీలను సరఫరా చేస్తామని అలాగే నడప్పు పిట్లను తయారు చేశామని వీటిని వినియోగించడం ద్వారా చాలావరకు వీధులలో చెత్త వేయడం తగ్గిందని ఉద్యోగులందరూ తమ బాధ్యతగా ప్రజలందరికీ పర్యావరణ కాలుష్యంపై అవగాహన కల్పిస్తూ ఉండాలని కోరారు ముందుగా పాంచాలి రైతు సేవా కేంద్రం వద్ద మొక్కలు నాటారు అనంతరం ఎంపీటీసీ ఉమామహేశ్వరరావు తో కలిసి గ్రామ సభను నిర్వహించి గ్రామస్తులకు ఉద్యోగులకు పర్యావరణం పై పలు సూచనలు ఇచ్చారు తదుపరి వీఆర్వో ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మరియు ఈ వ్యర్ధాల రీసైక్లింగ్ పై విద్యార్థులు మరియు గ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు గ్రామ వ్యవసాయ సహాయకులు ఈదిబిల్లి శ్రీను ప్రకృతి సేద్య యల్ వన్ తిరుపతి నాయుడు గ్రామ పెద్దలు విద్యార్థులు గ్రామ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.