మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 19: మైపాడు బీచ్ లో 10 అడుగుల ఎత్తున విపిఆర్ భారీ సైకత శిల్పం. భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మత్స్యకార సోదరులు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినోత్సవం సముద్రాన్ని సైతం ఉర్రూతలూగించింది. ఆయన అభిమానులు ప్రత్యేక సైకత శిల్పం రూపొందించి వినూత్నరీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టిడిపి నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఐదు మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.ప్రత్యేకంగా రూపొందించిన పది అడుగుల ఎత్తైన సైకత శిల్పం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సరికొత్త శిల్పంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చిత్రంతోపాటు.. ఆయన పేద ప్రజల కోసం చేసిన సేవా కార్యక్రమాల చిత్రాలను అందులో ప్రతిబింబించారు. విపిఆర్ విద్య, విపిఆర్ వైద్యం, దివ్యాంగులకు ట్రై సైకిల్స్, విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్ల చిత్రాలను ప్రత్యేకంగా పొందుపరిచారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసిన మత్స్యకార సోదరులు ఎంపీ వేమిరెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ….. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవా కార్యక్రమాలతో ఈ ప్రాంతం పునీతమైందన్నారు. మైపాడు బీచ్ అభివృద్ధి దగ్గర నుంచి దేవాలయాల పునరుద్ధరణ వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించారని, అందుకు కృతజ్ఞతగా మత్స్యకార సోదరులందరూ ఎంత వైభవంగా విపిఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, బెజవాడ వంశీ రెడ్డి, 5 మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు మత్స్యకార సోదరులు తదితరులు పాల్గొన్నారు.