మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 19: ఉప్పొంగిన అభిమానం తరలివచ్చిన అభిమానగణం. ఒకేరోజు 1260 యూనిట్ల బ్లడ్ సేకరణతో రికార్డు. జిల్లా చరిత్రలో ఇదో మైలురాయి, భారీగా తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన నేతలు, యువత. పేదల పెన్నిధికి అసలైన జన్మదిన శుభాకాంక్షలు. విపిఆర్ అభిమానులు, నాయకులతో కిక్కిరిసిన విపిఆర్ కన్వెన్షన్. భారీ కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు.
నెల్లూరు ముద్దుబిడ్డ, పేద ప్రజల ఆరాధ్య దైవం, సేవామూర్తి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జన్మదినోత్సవం జిల్లా వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో అంగరంగవైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన మెగా రక్తదానం దిగ్విజయంగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువత విపిఆర్ కోసం రక్తదానం చేసేందుకు పోటీ పడ్డారు. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గం నుంచి భారీస్థాయిలో నాయకులు, కార్యకర్తలు, యువకులు ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. అభిమాన నాయకుడి పుట్టిన రోజు చిరకాలం గుర్తుండిపోయేలా చేశారు. ఒకే రోజు 1260 యూనిట్ల రక్తం సేకరణ ,ఈ రక్తదాన శిబిరంలో ప్రముఖ రెడ్‌క్రాస్ సొసైటీ, ప్రభుత్వ సర్వజనాసుపత్రి, నోవా బ్లడ్ బ్యాంక్, నారాయణ హాస్పిటల్స్ ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఎంపీ వేమిరెడ్డిపై ఉన్న అభిమానంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన యువత.. మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. దాదాపు ఒకరోజే 1260 యూనిట్ల రక్తం సేకరించారు. జిల్లాలో ఇదో రికార్డు. గత రికార్డులను బద్దలు చేస్తూ ఒక జాతరను తలపిస్తూ ఈ మెగా రక్తదానం శిబిరం జరిగింది.రక్తదానానికి క్యూ కట్టిన నేతలు..
ఎంపీ వేమిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా యువతే కాదు.. నేతలు కూడా రక్తదానం చేసేందుకు క్యూ కట్టారు. టీడీపీ ముఖ్య నాయకులు దువ్వూరు కల్యాణ్‌రెడ్డి, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య, కోడూరు కమలాకర్‌రెడ్డి, బెజవాడ వంశీరెడ్డి, ఇంతా మల్లారెడ్డి, వీరేంద్ర నాయుడు, గుడి హరిరెడ్డి, జొన్నవాడ ఆలయ మాజీ ఛైర్మన్ పుట్టా సుబ్రహ్మన్యం నాయుడుతో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. రెడ్‌క్రాస్ ఛైర్మన్ వాకాటి విజయ్‌కుమార్ రెడ్డి స్వయంగా రక్తదాన శిబిరంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసినవారికి ధ్రువీకరణ పత్రాలు అందించారు.పక్కా ఏర్పాట్లు..
సాధారణంగా ఎండాకాలంలో బ్లడ్ క్యాంపులు నిర్వహించడం తక్కువ. అలాంటి నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా నిర్వహించిన బ్లడ్ క్యాంపుకు భారీగా యువత నేతలు తరలివచ్చారు. అందుకు తగ్గట్టుగా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు సమకూర్చారు. ఫైర్ ఇంజన్ మెడికల్ క్యాంపు, డాక్టర్లు సిబ్బందిని అందుబాటులో ఉంచారు.ఎక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుని పక్కా ప్రణాళికతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.వెల్లువెత్తిన ప్రజా చైతన్యం.ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రజా చైతన్యం వెల్లువెత్తింది. ఆయన జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారన్న సమాచారం తెలియడంతో అనేక ప్రాంతాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చారు. వేలాదిమంది కన్వెన్షన్ సెంటర్‌కు తరలిరావడంతో జాతరను తలపించింది. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. వేమిరెడ్డి లాంటి వ్యక్తి జిల్లాలో ఉండటం అదృష్టమని, అలాంటి వ్యక్తి పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఆయన మరిన్ని పుట్టిన రోజులు చేసుకోవాలని, ఆయన సేవలు మరింత కాలం కొనసాగాలని వారు ఆకాంక్షించారు.ఇంత భారీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి పూర్తి సహాయ సహకారాలను అందించిన ప్రతి ఒక్కరికీ విపిఆర్ అభిమానులు, నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వేమిరెడ్డిపై తమ అభిమానాన్ని చాటుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.