మన న్యూస్, కోవూరు,ఏప్రిల్ 19:- నెల్లూరు జిల్లా ప్రజలకువేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేస్తున్న సేవలు ఎనలేనివి.స్వంత నిధులతో పాటు,ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి జిల్లాను అభివృద్ధి చేస్తున్నారు.దాదాపు 80 వేల కోట్లు విలువ చేసే బీపీసిల్ ప్రాజక్టు ను జిల్లాకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. వారి జన్మదిన సందర్భంగా వారికి భగవంతుడు ఆయు,ఆరోగ్యాలు, సిరి సంపదలు ప్రసాదించాలి. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం జన్మదిన సందర్భంగా కోవూరు లోని చేజర్ల వేంకటేశ్వర రెడ్డి కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వేంకటేశ్వర రెడ్డి కేక్ కట్ చేసి వి పి ఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా చేజర్ల వేంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ…………నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాలలోకి రాక మునుపే తన స్వంత నిధులతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు.అమృత ధార పేరుతో పెద్ద ఎత్తున మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు అందించారు అనే అన్నారు.పేదలకు ఉచితంగా విద్య,వైద్యం అందించారు,అనేక ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు,అనేకమంది రాజకీయ నాయకులు ట్రస్ట్ లు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపట్టి,ఎన్నికలు అయిన తరువాత ఆ ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టడం లేదు.కానీ వి పి ఆర్ ఎన్నికలు అయిన తరువాత సేవా కార్యక్రమాలు మరింత ఉదృతం చేశారు అని తెలియజేశారు.తన స్వంత నిధులతో సేవా కార్యక్రమాలు,అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ, మరో వైపు పార్లమెంట్ సభ్యుడు గా జిల్లాకు పెద్ద ఎత్తున ప్రాజక్టు లు తెస్తున్నారు అని తెలిపారు.నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని రామాయపట్నం పోర్టు వద్ద దాదాపు 80 వేల కోట్లు విలువ చేసే బి పి సి ఎల్ ప్రాజక్టు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు అని అన్నారు.కేంద్ర ప్రభుత్వం నుండి కోవూరు మండలానికి చేనేత క్లస్టర్ తీసుకొచ్చారు,అదే విధంగా కిషన్ సెజ్ లో పరిశ్రమల ఏర్పాటు కు కృషి చేస్తున్నారు అని అన్నారు.వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా వారికి భగవంతుడు ఆయు, ఆరోగ్యాలు, సిరి, సంపదలు ఉన్నత పదవులు ప్రసాదించాలని కోరుకుంటూ వారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కలికి సత్యనారాయణ రెడ్డి,ఇంటూరి విజయ్ కుమార్,ఇందుపూరు మురళీ కృష్ణ రెడ్డి, కుక్కంటి గోపాల్,గొర్రిపాటి నరసింహ, సజ్జా అశోక్, బాధిపూడి శ్రీనివాసులు,నిమ్మకాయల రమేష్, చల్లా సూర్య, చల్లా మురళీ, గేమిడి శివకుమార్,బొడ్డు శ్రీను, షేక్ కలీల్,కంటేపల్లి రవి, తాళ్ళపాక లక్ష్మయ్య,పుల్లూరు మదన్,వేమయ్య,పూల యశ్వంత్,సలపాక్షి వినయ్.