గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 19 :- జోగులాంబగద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల స్టేజీ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెత్ అయ్యారు. హైదరాబాద్ నుండి నంద్యాలకు కారులో ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు వెళ్తుండగా ఇటిక్యాల మండలంలో 44వజాతీయ రహదారిపై ప్రియదర్శి హోటల్ ముందు వారి కారు అదుపుతప్పి పడింది. కారులో మొత్తం ఆరుగురు ఉన్నారు. అందులో పుల్లారెడ్డి, లక్ష్మీసుబ్బమ్మ వీరిద్దరూ భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారూ. క్షతగాత్రులను హైవే అంబులెన్స్, 108 అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి కూడా తీవ్రంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. నంద్యాలలో ఓ ఫంక్షన్ నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.