తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్ :
జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా వినతి పత్రం. తవణంపల్లి నవంబర్ 16 మన న్యూస్
జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా మండలంలోని జర్నలిస్టుల సమస్యలపై తహసిల్దార్ సుధాకర్ కి ఎంపీడీవో రెడ్డి బాబు,కి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఆఫ్ జర్నలిస్ట్ యూనియన్ (ఏపీ యూ డబ్ల్యూ జే ) పిలుపుమేరకు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టులందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేసి స్థలము కేటాయించి పక్కా గృహాలు మంజూరు చేయాలని, తవణంపల్లి నందు జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మించుటకు స్థలం కేటాయించాలని, జర్నలిస్టుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఆఫ్ జర్నలిస్ట్ యూనియన్ కమిటీ సభ్యులు జగన్నాథం, జీవన్, తవణంపల్లి మండల జర్నలిస్టులు చిన్నయ్య, రాజశేఖర్, అనంత కుమార్, నాగరాజు, షణ్ముగం, హరి, పాల్గొన్నారు.a