మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల కేంద్రంలోని కందుకూరు రోడ్డు సెంటర్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చలివేంద్రాన్ని గంజి సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మానవతా స్వచ్ఛంద సంస్థ సింగరాయకొండ చైర్మన్ రామలక్ష్మమ్మ మాట్లాడుతూ దాతల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,ఎండలు తీవ్రత దృష్ట్యా పాదచారుల కొరకు చలివేంద్రం ప్రారంభించామని మరి కొన్ని కూడా ప్రారంభిస్తామని, కాసుల రామ్మోహన్ చలివేంద్రం ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించారని తెలియజేశారు. కార్యక్రమంలోమానవతా సభ్యులు మునగపాటి వెంకటరత్నం, మహంకాళి నరసింహారావు, మారెళ్ల లక్ష్మీ నారాయణ ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి, అర్రిబోయిన రాంబాబు,పూర్ణచంద్రరావు, చిట్టిబాబు,గుంజి రమణయ్య, జేవీ సుబ్బారావు, రామారావు, పెట్లూరి శ్రీనివాస మూర్తి ఇతర మానవతా సభ్యులు పాల్గొన్నారు.