మన న్యూస్, నెల్లూరు, ఏప్రిల్ 18: యాదవ ఉద్యోగులకు హృదయపూర్వక సవినయ ధన్యవాదములు. యాదవ ఎంప్లాయీస్ సొసైటీ (YES) ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మీరందించిన సహాయ సహాకారాలు మరచిపోలేనివి.అన్ని విభాగాల ఉద్యాగులను ఏకతాటిపై నడిపించిన అన్ని కమిటీల బాధ్యులకు హృదయ పూర్వక ధన్యవాదములు తెలియజేసిన YES.నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ జ్యోతి రావు పూలె ఎస్బిఐ ప్రక్కన నూతన YES భవనం ను ఏప్రిల్ 18 శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గెజిటెడ్ జె ఏ సి అధ్యక్షులు కె.వి కృష్ణయ్య యాదవ్, అడిషనల్ ఎస్పీ అసెంబ్లీ చీప్ మార్షల్ వి. గణేష్ బాబు యాదవ్,ఆత్మకూరు మున్సిపల్ కమీషనర్ గంగా ప్రసాద్ యాదవ్ చేత ప్రారంభించ బడింది.తదుపరి శ్రీ కృష్ణ సాయి కన్వర్షన్ హాల్ నుందు కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర గెజిటెడ్ జేఏసీ అధ్యక్షులు కె.వి కృష్ణయ్య మాట్లాడుతూ ......... యాదవ కుటుంబాలలో విద్య ఉద్యాగాలలో ఉండే విధంగా ప్రతి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని తెలియజేశారు. చీప్ మార్షల్ వి.గణేష్ బాబు యాదవ్ మాట్లాడుతూ......క్యాంపస్ ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి సాధించి యాదవ కుటుంబాలలో నైతిక విలువలను పెంపొందించాలని చెప్పారు. అధ్యక్షులు ఎన్ ఎన్.రవీంద్ర మాట్లాడుతూ....... Yes అనేది ప్రతి ఒక్కరిదీ, సమస్యలను కమిటి దృష్టికి తీసుకొస్తే సకాలంలో పరిష్కరిస్తామని తెలియ చేయడమైనది. రాష్ట్ర YES అధ్యక్షులు,YES వ్యవస్థాపకులు డి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..... YES ను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించియున్నది ,ఇంకా అన్ని జిల్లాలను పటిష్టంగా చేస్తూ యాదవ ఉద్యోగ మిత్రులందరి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. తరవాత పలువురు మాట్లాడటం జరిగింది. ఈ సమావేశానికి ఇతర జిల్లాల నుండి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిల్లా నలుమూలల నుండి యాదవ ఉద్యోగ మిత్రులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యాదవ ఎంప్లాయిస్ సొసైటీ (YES) నూతనంగా కమిటీని ఎన్నుకోవడం జరిగినది.గౌరవాద్యక్షులు :గుమ్మడి శ్రీనివాసులు యాదవ్,ఉడత వెంకటేశ్వర్లు యాదవ్ జిల్లా అధ్యక్షులు :- ఎన్ .రవీంద్ర యాదవ్జిల్లా ప్రదాన కార్యదర్శి : పి.శ్రీనివాసులు యాదవ్జిల్లా ఆర్థిక కార్యదర్శి :వై. జానకిరామ్ యాదవ్గౌరవ సలహ దారులు :- ఏ. నాగేశ్వరరావు యాదవ్ ఏ.వెంకటేశ్వర్లు యాదవ్దయాకర్ యాదవ్గురు ప్రసాద్ యాదవ్జిల్లా ఆర్గనైజింగ్:- బి.మురళి యాదవ్ బి.కోటేశ్వరరావు యాదవ్ జి.గోపాల్ యాదవ్జిల్లా కార్యదర్శులు:- వి.మురళి యాదవ్ బి. సుకుమార్ యాదవ్ పి.జగదీష్ యాదవ్ ఎస్.కొండయ్య యాదవ్గురవయ్యయాదవ్జిల్లా ఉపాధ్యక్షులు:- టి .ప్రవీణ్ యాదవ్ కె.వినయ్ యాదవ్ బి. సురేష్ బాబు యాదవ్ ఏ.బలరామయ్య యాదవ్ సిహెచ్. శ్రీనివాసులు యాదవ్కార్యాలయం ఇంచార్జీలు:- కె.శివకుమార్ యాదవ్ జె.జయ రామయ్య యాదవ్లోకేష్ యాదవ్రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్:- కె.వాసు యాదవ్,శ్రీనివాసులు యాదవ్సుంకు వెంకటేశ్వర్లు యాదవ్‌లను ఎకగ్రీవంగా ఎన్నుకానబడినారు. ఎన్నిక కాబడిన వారందరికీ ప్రతేక అభినందనలు తెలియ చేస్తున్నాం.ఏర్పడిన నూతన కమిటి రెండు సంవత్సరాల పాటు సంఘ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.మన జిల్లా (YES) యాదవ ఎంప్లాయీస్ భవనము నుండి కార్య కలాపాలు జరుగును తెలియజేశారు.ఈ కార్యవర్గ సమావేశానికి హజరై కార్య క్రమమును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి దన్యవాదములు నూతన కమిటీ సభ్యులు తెలియజేశారు.