పాచిపెంట నవంబర్16( మన న్యూస్ ):=
పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట లో ఆశ వర్కర్స్ యూనియన్ పాచిపంట మండలం నాయకులు జలుమూరి చండి పి. నిర్మల కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ నాయకులు కే.మల్లేశ్వరి కస్తూరి పోలమ్మ సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ జి.వెంకటరమణకి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించడం జరిగింది. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అలాగే నవంబర్ 18న కలెక్టరే వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమానికి ఆశ వర్కర్ల తరలి రావాలని సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ డాక్టర్ వెంకటరమణ కి వినతి పత్రం అందించడం జరిగింది.