మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని గాయత్రి చక్కెర కర్మాగారంలో ఎరువుల గోదాము,మల్లూర్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘంమును బిచ్కుంద ఏడిఏ అమీనాభి తనిఖీ చేశారు.అనంతరం యూరియ,ఇతర ఎరువుల నిల్వలు,నిల్వ పట్టికలు,నిల్వ రిజిస్టర్ లు పరిశీలించారు.ఈ ఆమె మాట్లాడుతూ.. ఆధార్ కార్డు తీసుకుని వచ్చిన రైతులకు ఈపిఓఎస్ యంత్రం ద్వారా అవసరమైన ఎరువులు విక్రయించాలని సూచించారు.అధిక ధరలకు ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇతనికిలో ఆమె వెంట. మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్,ఏఈఓ సాగర్, మల్లూరు సొసైటీ సీఈవో సాయిలు తదితరులున్నారు.