మనన్యూస్,నెల్లూరు:కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేర్వేరు ఘటనలలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకై నెల్లూరు నారాయణ హాస్పిటల్ కు విచ్చేసారు. విడవలూరులో అంబేద్కర్ జయంతి సందర్భంగా బాణాసంచా కాలుస్తూ ప్రమాద వశాత్తు గాయపడి నెల్లూరు నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్యాం అనే యువకుడ్ని ఆమె పరామర్శించారు. బుచ్చిరెడ్డి పాళెంలోని బాంబే రోడ్డుపై పారిశుధ్య విధులు నిర్వహిస్తూ లారీ ఢీ కొన్నసంఘటనలో తీవ్రంగా గాయపడి నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శానిటేషన్ ఉద్యోగి కర్రా దశయ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విడవలూరుకు చెందిన శ్యాం మరియు బుచ్చిరెడ్డి పాళెం పట్టణానికి చెందిన కర్రా దశయ్యలకు మెరుగైన వైద్య చికిత్సలు అందివ్వాల్సిందిగా ఆమె డాక్టర్లను సూచించారు. బాధితులకు ఏ అవసరమొచ్చినా తాను ఆదుకుంటానని ఆమె బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో పాటు బుచ్చి కమీషనర్ బాలకృష్ణ, ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ, టిడిపి నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి,సత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.