మనన్యూస్,తిరుపతి:టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజల వద్దకే పరిపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మాజీ ఎమ్మెల్యే తిరుపతి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ సుగుణమ్మ తెలిపారు. బుధవారం సుగుణమ్మ స్వగృహం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తో పాటు టిడిపి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు వట్టికుంట శంకర్ నారాయణ, రాష్ట్ర, జిల్లా నేతలు బుల్లెట్ రమణ, బి జె కృష్ణ యాదవ్, రజక కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కరాటే చంద్ర, టిడిపి తిరుపతి పార్లమెంటు అధికార ప్రతినిధి మునిశేఖర్ రాయల్ లు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ ప్రజా దర్బార్ కు తిరుపతి నియోజకవర్గం లోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు 64 తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీలను అందజేశారు. అనంతరం సుగుణమ్మ మీడియాతో మాట్లాడుతూ ఆయా శాఖలకు సంబంధించిన వెంటనే వారికి పంపించి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి బుధవారం తాము నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.