మనన్యూస్,సింగరాయకొండ:పాకల గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో ఈరోజు పోషణ పక్వాడా కార్యక్రమం మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ ఎస్.కే. సైదాబీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “మొదటి వెయ్యి రోజులు (గర్భధారణ నుండి 2 సంవత్సరాల వరకు) ప్రతి తల్లికి బిడ్డ ఆరోగ్య భవిష్యత్తును నిర్ణయించే కీలక దశ” అని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా అందించబడుతున్న పౌష్టికాహారాన్ని గర్భవతులు, బాలింతలు తప్పనిసరిగా వినియోగించుకోవాలని, తద్వారా రక్తహీనత నివారించదగదని, పిల్లలు ఆరోగ్యంగా ప్రసవించబడతారని ఆమె సూచించారు.ఇక ఊళ్లపాలెం గ్రామంలో దేవలం పల్లెపాలెం అంగన్వాడీ కేంద్రంలో కూడా సూపర్వైజర్ షేక్ రిజ్వాన ఆధ్వర్యంలో పోషణ వారోత్సవాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గర్భిణీలకు సాంప్రదాయ పద్ధతిలో సీమంతం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు సయ్యద్ మసూద్ అలీ, పాకల మండల ప్రజా పరిషత్ ప్రధానోపాధ్యాయులు వెంకయ్య, వార్డు సచివాలయ సిబ్బంది, సీహెచ్ఓలు, ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.