మనన్యూస్,కోవూరు:కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 10 నెలలో 153 మంది అనారోగ్య పీడితులను ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకున్నాం.9 విడతలుగా 2 కోట్ల 37 లక్షల ఆర్ధిక సహాయం అందచేసి ఆదుకున్నాం.ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
అత్యవసర వైద్య అవసరాలకు పేదరికం అడ్డు రాకూడదన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్ లోని విపిఆర్ నివాసంలో ఆమె కోవూరు నియోజకవర్గ పరిధిలోని 23 మంది అనారోగ్య పీడితులకు 3 లక్షల 31 లక్షల 8 వేల 483 రూపాయల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి అత్యవసర సహాయం అందిస్తూ చంద్రబాబు నాయుడు నిరు పేదలకు ప్రాణభిక్ష పెడుతున్నారన్నారు.అనారోగ్యాల బారిన పడి ఆర్ధికంగా చితికి పోయి వున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిది కొండంత అండగా నిలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిరుపేదలను ఆదుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పేందుకు గర్వపడుతున్నానన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అనేవి ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం మాత్రమే కాదు ఆపదలో వున్న ప్రజలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, రావెల వీరేంద్ర నాయిడు తదితరులు పాల్గొన్నారు.