మన న్యూస్,నిజాంసాగర్,
ఈనెల 27న వరంగల్ లో తలపెట్టిన కేసీఆర్ సభను విజయవంతం చేయాలంటూ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పిలుపునిచ్చారు. మంగళవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.. 5 లక్షల మందితో తలపెట్టిన చలో వరంగల్ సభ కు జుక్కల్ నియోజకవర్గం నుంచి సుమారు 3000 మంది హాజరుకానున్నారని ఆయన అన్నారు. వరంగల్ సభకు వచ్చే పార్టీ శ్రేణులు అభిమానులు నాయకులు కార్యకర్తలు వారికి కేటాయించిన వాహనాలలో ఎలా రావాలి ఎప్పుడు బయలుదేరాలి అనే విషయాలపై కార్యకర్తలతో చర్చించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన సాగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని మహిళలకు నెలకు రూ.2,500 ఆడపిల్ల పెళ్ళికి తులం బంగారం పింఛన్ పెంపు వంటి పథకాలతో పాటు మరెన్నో పథకాలను హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటి గురించే మర్చిపోయారని అన్నారు. 16 నెలల పరిపాలన రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలు కొనసాగడం తప్ప అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ సీడీసీ పట్లోళ్ల దుర్గారెడ్డి, గైని విఠల్,మనోహర్,రమేష్ గౌడ్, హైమద్,బేగరి రాజు, వెంకటేశం,శ్రీకాంత్ రెడ్డి, అంజయ్య,తదితరులు పాల్గొన్నారు.