మన న్యూస్ పాచిపెంట ఏప్రిల్ 15:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో మొక్కజొన్న తర్వాత మరల మొక్కజొన్న సాగు చేసే అలవాటు ఎక్కువగా ఉందని రబి సీజన్లో మొక్కజొన్న వేసిన తర్వాత మరల ఖరీఫ్ సీజన్ మొక్కజొన్న వెయ్యటానికి 70 నుండి 80 రోజుల వ్యవధి ఉంటుందని ఈ సమయంలో పెసర లేదా మినుము వేసుకుంటే పంట మార్పిడి ప్రయోజనాలను కొంతవరకు సాధించవచ్చునని వ్యవసాయ అధికారి కే తిరుపతిరావు అన్నారు పాంచాలి గ్రామంలో రైతులు పాంచాలి ఈశ్వరరావు కలువలపల్లి సోంబాబు క్షేత్రాలలో వేసవి పెసర మరియు మినుము విత్తనాలను చెల్లించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి అపరాల సాగుతో అదనపు ఆదాయం వస్తుందని ఈ ఆదాయంతో వచ్చే ఖరీఫ్ సీజన్ కు పెట్టుబడి కలిసి వస్తుందని వేసవి అపరాలు సాగు ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. నేలను వేసవిలో అధిక వేడి నుండి కాపాడుతుంది అపరాల వేర్ల గుడిపల్లి మీద ఉండే రైజోబియం బ్యాక్టీరియా గాలిలో ఉండే నత్రజని భూమిలో స్థిరీకరించి ఖరీఫ్ పంటకు అందిస్తుంది ఖరీఫ్ పంటలో కలుపు ఉధృతి తగ్గుతుంది.సారవంతమైన మృత్తిక గాలికి ఎండకు వానకు కొట్టుకొని పోకుండా కాపాడుతుంది, భూమిలో జీవ వైవిధ్యాన్ని పెంచుతుంది, నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది, పైరు వ్యర్ధాలను కలియ దున్నటం వలన నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది, ప్రస్తుతం 50 శాతం రాయితీపై విత్తనాలు అందజేయబడుతున్నాయని కావలసిన రైతులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించి వేసవి అపరాలు సాగు ద్వారా భూమిని కాపాడుకుంటూ అధిక దిగుబడులు పొందవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా ప్రకృతి సేద్య యల్ వన్ తిరుపతి నాయుడు పెసర మరియు మినుము పంటలకు విత్తన గుళికలు తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీను, దినేష్,బాలకృష్ణ,గణేష్, అనిల్ కుమార్,మరియు రైతులు పాల్గొన్నారు.