మనన్యూస్,సింగరాయకొండ:తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో సింగరాయకొండ బైపాస్ ఎమర్జెన్సీ లాండింగ్ పోలేరమ్మ గుడి వద్ద ఒంగోలు వైపు నుండి నెల్లూరు వైపు వెళ్తున్న మోటార్ సైకిల్ అతను ప్రమాదవస్తు రాత్రి డివైడర్ గుద్దుకొని తలకు రక్త గాయాలయి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ చేరి చికిత్స పొందుతూ తెల్లవారుజామున చనిపోయినాడు. మృతుడి వివరాలు. షేక్ మహబూబ్ సుభాని సన్నాఫ్ మస్తాన్వలి పెద్ద జాగర్లమూడి గ్రామము యద్దనపూడి మండలం ఇతను గూడూరులో హోటల్ లో పనిచేయుచున్నాడు
తన అమ్మవారి ఇంటికి వచ్చి తిరిగి గూడూరు వెళుతుండగా ప్రమాదం జరిగినది. ఏఎస్ఐ షేక్ మహబూబ్ బాషాకేసు నమోదు చేసి దర్యాప్తు చేయుచున్నారు.