మనన్యూస్,సింగరాయకొండ:గ్రామ పంచాయతీ నందు పనిచేయు పారిశుధ్య కార్మిక సిబ్బందికి తే: 15/04/2025 దిన దుస్తులు , నిత్యావసర సరుకులు ,పాదరక్షకాలు ( చెప్పులు ) లను సర్పంచ్ " తాటిపర్తి వనజ " అద్యక్షతన గ్రామ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో పంపిణీ చేయటం జరిగింది. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ మరియు పరిశుభ్రత లో పంచాయతీ కార్మిక సిబ్బంది యొక్క పనితీరు ఎంతో గొప్పదని వారిని గౌరవించవలసిన అవసరం ఉందనని సర్పంచ్ తాటిపర్తి వనజ అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పడిదపు రవి కుమార్ , మేకల నరేష్ బాబు, ఓలేటి రవి శంకర్ రెడ్డి , షేక్ షాకీరా, షేక్ ముజీబ్ , పంచాయతీ కార్యదర్శి ఎన్ . జగదీష్ బాబు, జూనియర్ అసిస్టెంట్ జె. శ్రీనివాసులు , బిల్ కలెక్టర్ సిహెచ్ .శ్రీనివాసులు ,పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.