మనన్యూస్,నెల్లూరు:వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని నినాదాలతో హోరెత్తించిన ముస్లిం సోదరులు.
నెల్లూరులో ముస్లిం సోదరులు కదం తొక్కారు. వక్ఫ్ సవరణ బిల్లు ను పార్లమెంట్లో ఆమోదించడాన్ని నిరసిస్తూ నెల్లూరు నగరంలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు పరిరక్షణ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని స్థానిక చిన్న బజార్ నుండి ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ కమ్యూనిస్టు అనేక ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ఈ ర్యాలీలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వక్ఫ్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని వారిని అనగతొక్కడే లక్ష్యంగా పనిచేస్తుందని నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట సవరణ బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని హెచ్చరించారు.