మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చిత్రపటానికి తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నివాళులర్పించారు.ఈ సందర్బంగా బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు.ఈ సందర్బంగా ఎం. పి గురుమూర్తి మాట్లాడుతూ……..డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఎంతో దృఢమైన రాజ్యాంగాన్ని అందించారని తెలిపారు.రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలంటే సరైన రాజకీయ వ్యవస్థ పనిచేయాలన్నారు.ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన అమలు చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని దుయ్యబట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే టార్గెట్ గా టిడిపి నేతలు రెచ్చిపోతున్నారని.. వారి అరాచకం ఎంతో కాలం సాగదని హేచ్చరించారు. ఈరోజు చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో కూటమి ప్రభుత్వం కొంతమంది ప్రజలకు, ఉద్యోగులకు ఎలాంటి పని చేయకూడదని ఆదేశాలు ఇస్తూ విభజించి పాలించు సూత్రాన్ని అమలు చేస్తుందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.