మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 23వ డివిజన్, రామ్మూర్తి లేఔట్ మాస్టర్స్ కాలనీలో సోమవారం పర్యటించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్, యువనేత, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఇప్పటికే 191 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి పనులు సాగుతున్నాయి అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.శివారు ప్రాంతాల అభివృద్ధికై ఇప్పటికే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టారు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. 23వ డివిజన్ రామ్మూర్తి లేఔట్, మాస్టర్స్ కాలనీ నందు రోడ్లు, డ్రైన్లు ఏర్పాటుకు కృషి చేస్తాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దుద్దగుంట (ఒరిస్సా) శ్రీనివాసులు రెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ కనపర్తి గంగాధర్, టిడిపి నాయకులు పాతపాటి పుల్లారెడ్డి, పామూరు సుధాకర్ రెడ్డి, మేకల మధు, చల్ల (వార్త) సుబ్బన్న, అబ్బు వెంకటరమణ, మల్లికార్జున్ రెడ్డి, శివయ్య, కాకు చిన్న మల్లికార్జున, మురళి, మల్లికార్జున, కేశవులు, పాలేటి శివ, పాల వెంకట రమణయ్య, మేకల రాజన్న, ఉడతా సుధాకర్, వినయ్ కుమార్, నరసింహ రెడ్డి, నాగిరెడ్డి, బాబు నాయుడు, జడ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.