మనన్యూస్,నెల్లూరు:నెల్లూరు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, అధికారులు, దళిత సంఘాల నాయకులు.
ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులు సమాజంలో అసమానతలు తొలగించేందుకు ఆయన ఎనలేని కృషి చేశారు అని అన్నారు.
భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారు.ఈ రోజుకీ సమాజంలో గిరిజనులు, దళితులే ఎక్కువ పేదరికంలో ఉన్నారు,అమాయకులు కూడా వీరే అని అన్నారు.గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం కల్గించేందుకు తెచ్చిన ఫ్రీహోల్డ్ చట్టం దుర్వినియోగం అయింది అని తెలిపారు.పేదలకు ఎంతో కొంత ఇచ్చి విలువైన భూములను పెద్దరెడ్లు సొంతం చేసుకున్నారు అని అన్నారు.
ఎమ్మెల్యేలుగా వ్యవహరించిన వ్యక్తులు కూడా దళితుల భూములను కబ్జా చేయడం దుర్మార్గం అని తెలియజేశారు.
నెల్లూరు నగర పరిధిలోని వావిలేటిపాడులో 7 ఎకరాల భూములను గతంలో ఒక పెద్దమనిషి ఆక్రమిస్తే నేను అధికారుల సహకారంతో తిరిగి పేదలకు అప్పగించాను అని తెలియజేశారు.వెంకటాచలం మండలం సర్వేపల్లిలోనూ దళితులకు కేటాయించిన 6.21 ఎకరాల భూములు భూస్వాముల పరమయమయ్యాయి అని తెలిపారు.
దళితులు, గిరిజనులకు ఎవరు అన్యాయం చేసినా మేం ఊరుకోం. వారికి న్యాయం చేసేంత వరకు వదలబోము అని అన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలోని సంక్షేమ వసతి గృహాల్లో సౌకర్యాల కల్పనపైనా ప్రత్యేక దృష్టి పెట్టాం అని తెలియజేశారు.
వసతి గృహాల్లో ప్రతి 10 మంది చిన్నారులకు ఒక మరుగుదొడ్డి ఉండేలా లక్ష్యంగా పెట్టుకున్నాం అని అన్నారు.
మనుబోలు వసతి గృహంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగానే రూ.3 కోట్లు మంజూరు చేశారు అని అన్నారు.
సంక్షేమ వసతి గృహాల్లో చదువుకున్న అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ లుగా రాణించారు. వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి బిడ్డ బాగా చదువుకుని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలి అని తెలియజేశారు.