మన న్యూస్: కడప జిల్లా: బద్వేల్: ఏప్రిల్ 15: బద్వేల్ నియోజకవర్గం లోని ఏడు మండలాల మాదిగ చర్మకారు లకు చెన్నంపల్లి పొలం 1580 - B పొలం ముడుఎకరల 64 సెంట్లలో లో లెదర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి పుట్టు పైన చెప్పులు కుట్టుకునేవారికి కామన్ ఫెసిలిటీ సెంటర్ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేపిస్తామని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గన్నేపాటి మల్లేష్ పేర్కొన్నారు. మంగళవారం నాడు బద్వేల్ పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లాలో మాజీ లిడ్ క్యాప్ డైరెక్టర్ గూడూరు రాజశేఖర్ గారితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి చెన్నంపల్లి గ్రామం పొలం సర్వేనెంబర్ 1580 లో ఉన్నటువంటి మూడెకరాల 64 సెంట్లు స్థలాన్ని కబ్జా కాకుండా చూసి మాదిగ పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తానని లెదర్ పార్కును ఏర్పాటు చేసి చర్మకార శుద్ధి ఏర్పాటు చేయడం చెప్పులు తయారు చేయడం అంటే కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ ప్రాంత మాదిగ నిరుద్యోగ విద్యార్థులకు ఉపాధ్యాయ అవకాశము కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. లెదర్ పార్కు ఉన్నటువంటి స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా కాకుండా చూసి ఆ స్థలాన్ని సద్వినియోగం అదేవిధంగా కృషి చేస్తానని త్వరలో లెదర్ పార్క్ నిధులు కేటాయించుటకు కృషి చేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సీనియర్ నాయకులు ఓ ఎస్ వి ప్రసాద్, ముండ్లపాటి పిచ్చయ్య, కమలాపురం బాలయ్య, దళిత వేదిక జిల్లా నాయకులు ఓబయ్య, కోడూరు ఓబయ్య, నాగిపోవు ప్రసాద్, తదితర దళిత నాయకులు పాల్గొన్నారు.