మన న్యూస్,నిజాంసాగర్,మొహమ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో జివిఆర్ ట్రస్టు ప్రారంభత్సవ కార్యక్రమానికి విచ్చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ఆదివాసి నాయక్ పోడ్ కులస్తులు ఎస్టి కుల ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు.గత మూడు నెలల నుంచి మొహమ్మద్ నగర్ మండల తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్నారు.ఎస్టి కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో రాజీవ్ యువ వికాస్, రుణాలతో పాటు ఉపాధి ఉద్యోగ అవకాశాలు దూరం అవుతున్నామని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు.ఈ విషయంపై జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలో మీ సమస్యను పరిష్కరించే విధంగా చూస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, మొహమ్మద్ నగర్ నిజాంసాగర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి,ఏలే మల్లికార్జున్,నాయకులు గంగి రమేష్,లోక్య నాయక్,సవాయి సింగ్,ఆకాష్,సంతోష్, హనుమాన్లు,సరస్వతి,తదితరులు ఉన్నారు.