మన న్యూస్,నిజాంసాగర్,తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి కార్యక్రమం ప్రారంభోత్సవాన్ని మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్,మహమ్మద్ నగర్, నిజాంసాగర్ ఉమ్మడి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి,ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు.
రైతులకు భూములపై పూర్తి సమాచారం,భూ పత్రాల డిజిటలైజేషన్,పారదర్శక వ్యవస్థల అమలులో భూభారతి ముఖ్యపాత్ర పోషించనుందని తెలిపారు. వ్యవసాయాన్ని నూతన సాంకేతికతలతో మేళవిస్తూ రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని సర్వత్రా అభినందించవలసినదిగా వారు అభిప్రాయపడ్డారు.
ప్రజాప్రతినిధుల సానుకూల స్పందన,రైతులకు అందుబాటులోకి వస్తున్న డిజిటల్ వనరులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో ఏవో నవ్య, ఏఈఓ మధుసూదన్ ,రేణుక,తదితరులు ఉన్నారు.