కలిగిరి మన న్యూస్:: కలిగిరి మండలం కృష్ణారెడ్డి పాలెం లో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. గడ్డం రంజాన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన అనుపమ పరమేశన్ ను నూతన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు సాయం కోరగా తక్షణమే విగ్రహ ఏర్పాటుకు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు నగదు ఇచ్చి ఆమె దాతృత్వాన్ని చాటుకున్నారు. దాదాపు పది సంవత్సరాలుగా విగ్రహావిష్కరణకు ఇబ్బందులు పడుతున్న తరుణంలో అడిగిన వెంటనే మాకు విగ్రహాన్ని ఇచ్చినటువంటి దాతఅనుపమ మేడంకు మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలిపారు. 135వ జయంతి రోజు కలిగిరి సీఐ వెంకటనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశానికి రాజ్యాంగాన్ని రచించి దిశా దశ సూచించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. మన దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ దిశా నిర్దేశం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని అయితే ఈ సమాజం అంతటి మహోన్నతమైన వ్యక్తిని కొన్ని సామాజిక వర్గానికి పరిమితం చేసిందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కొన్ని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు అని అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఆశాజ్యోతిని తెలిపారు మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలు కొనియాడుతున్న వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని వారి దయవల్ల రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కును పౌర హక్కులను రచించారు రాజ్యాంగంతోనే పరిపాలన జరుగుతున్నది గుర్తించుకోవాలని తెలిపారు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగఫలం ద్వారానే ఇంతటి కీర్తి ప్రతిష్టలు పొందుతున్నానని అలాగే ఈ గ్రామంలోని ప్రజలందరూ రాజ్యాంగ విలువలు కాపాడి రిజర్వేషన్ ఫలాలు పొంది ప్రతి ఒక్కరూ ప్రగతి పథంలో ముందుకు నడవాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు గ్రామ గ్రామాన తెలియపరిచి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు