Mana News :- ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం, పేటమిట్ట శ్రీ కోదండ రామాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖ సినీ రచయిత మరియు రచయిత విజయేంద్ర ప్రసాద్. విజయేంద్ర ప్రసాద్ గారికి అమర రాజా వ్యవస్థాపక చైర్మన్ శ్రీ గల్లా రామచంద్ర నాయుడు గారు , మాజీ మంత్రివర్యులు గల్లా అరుణ కుమారి మరియు అమర రాజా సంస్థల చైర్మన్ గల్లా జయదేవ్ గారు ఆహ్వానించి పూర్ణకుంభ స్వాగతం పలికి గుడి విశిష్టతను వివరించడం జరిగింది, అదేవిధంగా పేటమిట్ట గ్రామంలో నందుగల అమర రాజా స్కిల్ డెవలప్ సెంటర్, పబ్లిక్ హెల్త్ సెంటర్ మరియు ఇతర సదుపాయాలని వీక్షించారు. అనంతరం విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ శ్రీ గల్లా గల్లా కుటుంబం గ్రామీణలో సంస్థ లను నెలకొల్పి వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మరియు అనేక రకాల సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు, వారు ఈ సేవా కార్యక్రమాలు ఇలానే ముందుకు తీసుకెళ్తూ అనేక మందికి అందించాలని కోరుకుంటున్నాను మరియు వారి సేవలను అభినందిస్తున్నాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేటమిట్ట గ్రామ ప్రజలు మరియు భక్తులు పాల్గొన్నారు.