మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నిజాంసాగర్ మండలంలోని మల్లూరు గ్రామంలో బారేడు పోచమ్మ ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం కుస్తీ పోటీలను ఉదయం గ్రామ పెద్దలు ఎస్ కృష్ణారెడ్డి కొబ్బరికాయ కొట్టి కుస్తీ పోటీలను ప్రారంభించారు.కుస్తీ పోటీలను తిలకించేందుకు మహారాష్ట్ర కర్ణాటక జహీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి మరలయోధులు తరలివచ్చారు.కుస్తీ పోటీలో గెలుపొందిన మరలయోదులకు నగదును అందజేశారు.ఆఖరి కుస్తీ పోటీ 1000 రూపాయలు,5 తులల వెండిని గ్రామ పెద్దలు కృష్ణారెడ్డి బహుకరించారు. ఉదయం మొదలైన కుస్తీ పోటీలు 100,500,1000,వరకు కొనసాగాయి.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒంటరి శ్రీనివాస్ రెడ్డి,ఉపాధ్యక్షుడు గొల్ల హనుమాన్లు,గ్రామస్థులు బుడిమే శ్రీనివాస్,బింగి శేఖర్, బండారి రాజు,పెద్ది అంజయ్య, పెద్ది మైషయ్య,ఊరటి విట్టల్,నాగంపల్లి కృష్ణ.చాకలి ఎల్లయ్య.తదితరులు పాల్గొన్నారు.